Allu Arjun Case: అల్లు అర్జున్ కు సంధించిన ప్రశ్నలు ఇవే..! 12 d ago
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఏసీపీ, సెంట్రల్ జోన్ డీసీపీ నేతృత్వంలోని బృందం అల్లు అర్జున్‌ను విచారిస్తున్నారు. న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో విచారణ కొనసాగుతుంది. 50కి పైగా ప్రశ్నల్ని పోలీసులు అల్లు అర్జున్ ముందు ఉంచారు. సంధ్య థియేటర్ దగ్గర ఎందుకు ఊరేగింపుగా వెళ్లాల్సి వచ్చింది?, సంథ్య థియేటర్‌కు రావొద్దని యాజమాన్యం మీకు ముందే చెప్పిందా?, పోలీసుల అనుమతి లేదన్న విషయం తెలుసా?.. తెలియదా?, సంధ్య థియేటర్‌లో ప్రీమియర్ షోకు వస్తున్నట్లు అనుమతి కోరారా? ఆ కాపీ ఏమైనా ఉందా?, మీరు గానీ, మీ పీఆర్ టీమ్ గానీ పోలీసుల అనుమతి తీసుకున్నారా?, సంధ్య థియేటర్ వద్ద పరిస్థితిని మీ పీఆర్ టీమ్ ముందే మీకు వివరించిందా?, తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది?, తొక్కిసలాట జరిగిన విషయాన్ని మీకు ముందుగా ఎవరు చెప్పారు? ఏసీపీ చెప్పినప్పుడు థియేటర్ నుంచి ఎందుకు వెంటనే వెళ్లిపోలేదు?, సినిమా ప్రారంభమైన కొద్దిసేపటికే తొక్కిసలాట ఘటన గురించి తెలిసినా మీరెందుకు సినిమా చూశారు?, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మీరు ముందే థియేటర్ యాజమాన్యానికి చెప్పారా?, రోడ్ షో కోసం మీరు ఎంతమంది బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్నారు? ఈ అంశాలపై అల్లు అర్జున్ ని పోలీసులు విచారిస్తున్నారు. విచారణ అనంతరం, సంధ్య థియేటర్ ఘటనపై సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసే యోచనలో పోలీసులు ఉన్నారు.